ఆర్టికల్‌ 370 పై సినిమాకు రంగం సిద్దం

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెల్సిందే. లోక్‌సభ మరియు రాజ్యసభలో ఆమోదం లభించడంతో పాటు రాష్ట్రపతి నుండి కూడా గెజిట్‌ వచ్చింది. జమ్ముకశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విడదీయడంపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ప్రధాని మోడీ మరియు అమిత్‌ షాల నిర్ణయంను అంతా అభినందిస్తున్నారు. ఒక దేశం.. ఒక జెండా ఒక్కటే రాజ్యాంగం అంటూ మోడీ మరియు అమిత్‌ షా నినాదం అందరిని ఆకర్షించింది.

ఇప్పుడు ఆర్టికల్‌ 370 ఉద్దేశ్యం ఏంటీ, దాని రద్దు, ఆపై జరుగుతున్న నాటకీయ పరిణామాలపై బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ మరియు అమిత్‌ షాలను హీరోలుగా చూపిస్తూ ఆ సినిమా తీయాలని చాలా మంది ఆశపడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సర్దుమనిగేలా చేస్తుంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇలాంటి వివాదాస్పద విషయాలపై బాలీవుడ్‌లో సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. అవి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సర్జికల్‌ స్టైక్‌ నేపథ్యంలో ఉరి సినిమా తీసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.