బాలీవుడ్లో పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ రోజు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అభిజిత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. తన ఇంట్లో సీలింగ్‌కి ఉరి వేసుకొని బలవన్మరణంకి పాల్పడినట్టు స్థానికులు గుర్తించారు.
ప్రస్తుతం ఈ కేసు విషయంలో దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఆయన ఇంట్లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తన బ్యాంక్ అకౌంట్‌ను కుమార్తె పేరుపై ట్రాన్స్ఫర్ చేయమని కోరాడు.ఈ ఘటనను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసిన మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించినట్టు భందూప్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి రమేశ్ ఖేడ్ పేర్కొన్నారు.
గత కొంతకాలంగా అభిజిత్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని ఆయన భార్య తెలిపింది. కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల మానసిక కుంగుబాటుతో ఇలా బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, తుషార్ కపూర్ లాంటి ప్రముఖ నటుల చిత్రాలకు అభిజిత్ నృత్య రీతులు సమకూర్చారు. అభిజిత్ ఆత్మహత్యపై బాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు