దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి: ది కన్‌క్లూజన్ విడుదలై సంచలనం సృష్టిస్తుంది..ఎక్కడ చూసిన ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు..ఇక కలెక్షన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే..ఆ ఇండస్ట్రీ ..ఈ ఇండస్ట్రీ అని కాదు అన్ని భాషల్లో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇక బాలీవడ్ లో వసూళ్లు చూసి షాక్ అవుతూ , ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి లో ఉన్నారు.
హిందీలో తొలిరోజున అత్యధిక వసూళ్లు సాధించిన సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ను మించినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్ ట్వీట్ చేశారు. గతంలో ‘సుల్తాన్’ రూ. 36.54 కోట్లు, ‘దంగల్’ రూ. 29.78 కోట్లు రాబట్టిందని చెప్పారు. ఎటువంటి సెలవు, పండుగ లేకుండా భారీ స్థాయిలో వసూళ్లు రావడం మేజిక్ అని తరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘బాహుబలి 2’ అన్ని రికార్డులను బ్రేక్ చేసి, కొత్త రికార్డు సృష్టిందని చెప్పారు.