Sonakshi Sinha : ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ..


బాలీవుడ్‌ బ్యూటీ, స్టార్ హీరోయిన్ సోనాక్షిసిన్హా తాను ప్రేమించిన జహీర్‌ ఇక్బాల్‌ ను వివాహం చేసుకున్నారు. ఏడేళ్ల వీరి ప్రేమ బంధం ఏడడుగులతో ఒక్కటయింది. వీరిద్దరు ఆదివారం(జూన్ 23) రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వివాహానంతరం సోనాక్షి సిన్హా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాశారు.

Nagarjuna : క్షమాపణలు చెప్పిన నాగార్జున..?

“ఏడేళ్ల క్రితం (23.06.2017) ఇదే రోజున మేము ఒకరి కళ్ళల్లో ఒకరం స్వచ్ఛమైన ప్రేమను చూశాం. ఆ ప్రేమను అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లను అధిగమించి, ఈ అందమైన క్షణానికి దారితీసింది. మా ఇద్దరి కుటుంబాలు మరియు దేవుని ఆశీర్వాదంతో మేం ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాం. ఇప్పటికీ ఎప్పటికీ.. సోనాక్షి-జహీర్‌.. 23.6.2024” అని ఉద్వేగభరితమైన పోస్ట్‌ని షేర్‌ చేశారు.

NKR21 : మళ్ళీ ‘వైజయంతి IPS’ గా విజయశాంతి.. ఫస్ట్ లుక్ అదుర్స్ !

ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొత్త దంపతులకు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.