Site icon TeluguMirchi.com

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్

కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న తాజా చిత్రం బింబిసార. ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని మల్లిడి వశిష్ట అనే నూతన డైరెక్టర్ తెరకెక్కించగా..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా స్టిల్స్ , సాంగ్స్ , టీజర్ ఆసక్తి రేపగా..ఈరోజు ఎన్టీఆర్ ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి మరింత అంచనాలు పెంచారు. ఈ సందర్భంగా`బింబిసారుడి ప్రపంచం నుంచి మరో గొప్ప దర్శనం. ఆగస్ట్ 5న పెద్ద స్క్రీన్ అనుభవం మీ కోసం ఎదురుచూస్తోంది` అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ట్రైలర్ అంత కూడా ఆసక్తిగా సాగింది. `హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులను ఆపే రాజ్యాలను దాటి వేస్తూ విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణ భిక్ష…ఎదిరిస్తే మరణం.. అంటూ కల్యాణ్ రామ్ చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్ లతో ట్రైలర్ మొదలైంది. ఈ కలల సామ్రాజ్యాన్ని సాధించే బింబిసారుడొస్తున్నాడు చూడూ..అనే డైలాగ్.. విజువల్స్ లో కల్యాణ్ రామ్ మరో క్యారెక్టర్ ని పరిచయం చేశారు. రెండు పాత్రలు విభిన్నంగా చాలా కొత్తగా వున్నాయి. నాగైనా నేడైనా..త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. ఈ బింబిసారుడి కత్తిని దాటాలి అంటూ మోడ్రన్ డ్రెస్ లో వున్న కల్యాణ్ రామ్ చెప్పే డూలాగ్స్.. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేథరిన్ సంయుక్త మీనన్ వరీనా హుస్సేన్ హీరోయిన్ లుగా నటించగా..కీరవాణి మ్యూజిక్ అందించారు. ఆగస్టు 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version