Site icon TeluguMirchi.com

విజయ్ `బిగిల్‌` ఫస్ట్ లుక్..

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ – అట్లీ కాంబినేషన్లో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈరోజు విజయ్ పుట్టిన రోజు ( జూన్ 22) సంద‌ర్భంగా చిత్ర టైటిల్‌తో పాటు రెండు లుక్స్‌ విడుదల చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు చిత్ర యూనిట్.

`బిగిల్‌`( విజిల్ అనే అర్థం) అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే.. మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండగా.. ఇక ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

విజ‌య్ – అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version