Site icon TeluguMirchi.com

Bigg Boss Telugu 8 : వరాలు ఇచ్చే కింగ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు !


Bigg Boss Telugu 8 Teaser : ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మరో సరికొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకు సంబంధించిన సీజన్ 8 లోగోను ఇటీవలే విడుదల చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు టీజర్ ను కూడా విడుదల చేశారు. గత కొన్ని సీజన్ల నుండి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున, ఈ సీజన్ 8కు కూడా హోస్ట్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇక కమెడియన్‌ సత్య పాత్రతో పరిచయమైన టీజర్‌లో నాగార్జున వ‌రాలు అందించే జీనీ పాత్ర‌లో కనిపించారు.

Also Read : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్..

టీజర్ విషయానికి వస్తే సత్య ఒక దొంగతనానికి వెళ్లి అక్కడ ఏం ఏం వస్తువులు ఉన్నయో తన భార్యతో ఫోన్ లో చెప్తుండగా ఒక అల్లాద్దీన్ దీపం నుండి నాగార్జున ప్రత్యక్షం అయ్యి.. వరాలు ఇచ్చే కింగ్ అంటూ సత్యను నచ్చిన కోరిక కోరుకోమంటారు. ఏం అడిగినా ఇస్తారా అని సత్య అడగగా ఈసారి లిమిట్ లేకుండా ఇస్తాను. కానీ అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ తో ఈసారి అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఇకపోతే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమవుతుందని సమాచారం.

Also Read : ‘దేవర’ అప్డేట్.. పోస్టర్ అదుర్స్..

Bigg Boss Telugu 8 - Teaser | Coming Soon | Nagarjuna Akkineni | Star Maa

Exit mobile version