టాలీవుడ్ కోసం అమితాబ్ సాయం

బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. 12 వేల కరోనా రిలీఫ్‌ కూపన్లను ఏర్పాటు చేశారు. వీటిని అవసరాల్లో ఉన్న సినీ కార్మికులకు పంపిణీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘అమిత్‌ జీ రూ.1500 విలువజేసే 12 వేల కరోనా రిలీఫ్‌ కూపన్లను తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. ఈ విషయంలో అద్భుతమైన చొరవ చూపినందుకు బిగ్‌ బికి ‘బిగ్‌’ థ్యాంక్స్‌. ఈ కూపన్లను బిగ్‌ బజార్ స్టోర్స్‌లోనూ రీడీమ్ చేసుకోవచ్చు’ అని చిరు ట్వీట్‌ చేశారు.

టాలీవుడ్‌లోని సినీ కార్మికుల కోసం చిరు చొరవతో ప్రముఖులంతా కలిసి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.