Site icon TeluguMirchi.com

భూమిక అమ్మ అయ్యింది!

11వెండి తెర‌పై ఎన్నో పాత్ర‌ల్ని స‌మ‌ర్థంగా పోషించిన భూమిక నిజ జీవితంలో త‌ల్లి పాత్ర లోకి ప్ర‌వేశించింది. ఔను.. భూమిక త‌ల్ల‌య్యింది. ఇటీవ‌ల‌ ఓ మ‌గ‌బిడ్డ‌ను జ‌న్మించింది. గ‌ర్భం దాల‌చ్చ‌డం, ప్ర‌స‌వం అవ్వ‌డం ఈ విష‌యాల్ని గోప్యంగా ఉంచిన భూమిక‌.. ఎట్ట‌కేల‌కు ఈ శుభ‌వార్త అంద‌రితో పంచుకొంది. “దాచ‌డానికి పెద్ద‌గా కార‌ణాల్లేవు. భ‌ర‌త్‌, నేనూ తీసుకొన్న నిర్ణ‌యం ఇది. ఇప్పుడు మేం హ్యాపీ. మా బాబుని చూసుకొంటూ మురిసిపోతున్నాం. మాతృత్వంలో ఇంత గ‌ర్వం ఉంటుందా అనిపిస్తుంది. బిడ్డ కు జ‌న్మ‌నిచ్చేట‌ప్పుడు ఆ త‌ల్లి మ‌ళ్లీ పుట్టిన‌ట్టే లెక్క‌. అలా నేను, నా బిడ్డ‌తో పాటు మ‌ళ్లీ పుట్టా. భ‌ర‌త్ న‌న్ను కూడా ఓ పాప‌లా చూసుకొంటున్నాడు..“ అని చెబుతోంది మిస్స‌మ్మ‌. ఓ యేడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకొంద‌ట‌. ఆ త‌ర‌వాత‌.. మ‌ళ్లీ ఆమెను వెండితెర‌పై చూడొచ్చు. ఆమె న‌టించిన ‘ల‌డ్డూబాబు’ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Exit mobile version