Site icon TeluguMirchi.com

Bhoothaddam Bhaskar Narayana : క్యూరియాసిటీగా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ప్రీరిలీజ్ ట్రైలర్


శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ప్రీరిలీజ్ ట్రైలర్ ని మేకర్స్ గ్రాండ్ గా లాంచ్ చేశారు.

భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో శివ క్యారెక్టర్ ని బిగినింగ్ లో ఓ ఫన్ నోట్ లో ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో కథ ఉత్కంఠగా మారుతుంది. చెక్కతో చేసిన దిష్టి బొమ్మలు, చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పుకు వుండటం, సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్.. ఇవన్నీ చాలా ఎంగేజింగా వున్నాయి. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా వుంది. తన పాత్ర కథలో లీనం చేసేలా వుంది. రాశి సింగ్ కేసుని ఫాలో చేసే జర్నలిస్ట్ గా కనిపించింది. షఫీ, దేవిప్రసాద్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిరిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది.

Bhoothaddam Bhaskar Narayana Release Trailer | Shiva Kandukuri | Rashi Singh | Purushotham Raaj

Exit mobile version