Site icon TeluguMirchi.com

‘భోళా శంకర్’ ట్రైలర్.. రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా !


మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘భోళా శంకర్’. కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ వస్తున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా కథానాయకిగా నటిస్తుండగా, చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్, పాటలకు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రాంచరణ్ రిలీజ్ చేశాడు.

ట్రైలర్ అయితే యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్, విజువల్స్ వంటి అన్నీ అంశాలతో ఫుల్ మీల్స్ లా వుంది. ఇక చిరంజీవి మరోసారి తనదైన స్వాగ్ అండ్ సాలిడ్ యాక్షన్ తో అదరగొట్టేసాడు. చివర్లో చిరు, పవన్ కళ్యాణ్ మేనరిజం అనుకరించడం స్పెషల్ అట్రాక్షన్ గా వుంది. కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇకపోతే తమన్నా.. “రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా” అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Bholaa Shankar Trailer | MegaStar Chiranjeevi,Keerthy Suresh Tamannaah | Meher Ramesh | Anil Sunkara

Exit mobile version