Site icon TeluguMirchi.com

బుల్లోడు ఖాయ‌మ‌య్యాడు

bheemavaram-bullodu1వ‌రుస వాయిదాల ప‌రంప‌ర‌కు ‘భీమ‌వ‌రం బుల్లోడు’ చెక్ పెట్టాడు. ఈ సినిమా ఈనెల 27న వస్తుందా? రాదా? అనే అనుమానాల ప‌రంప‌ర‌కు తెర దించుతూ శివ‌రాత్రి రోజున వినోదాలు పంచ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. సునీల్ – ఎస్తేర్ జంట‌గా న‌టించిన చిత్రం భీమ‌వ‌రం బుల్లోడు. ఉద‌య్‌ శంక‌ర్ దర్శ‌కుడు. సురేష్ బాబు డి.నిర్మాత‌. ఈ చిత్రాన్ని శివరాత్రి కానుక‌గా ఈనెల 27న విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అనూప్ రూబెన్స్ స్వ‌రాలు అందించారు. సునీల్ ఈ సినిమాలో కాన్స‌ర్ పేషెంట్‌ గా క‌నిపిస్తాడ‌ని టాక్‌. దాని చుట్టే వినోదం నింపేశార‌ట‌. సునీల్ డాన్సులు, ఎస్తేర్ అందాలు, అనూప్ స్వరాలు, కామెడీ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ల‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

Exit mobile version