Site icon TeluguMirchi.com

బుల్లోడు భ‌య‌పడుతున్నాడు

sunilసునీల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భీమ‌వ‌రం బుల్లోడుకి క‌ష్టాలు త‌ప్పడం లేదు. ఈ సినిమా వాయిదాల ప‌ర్వం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. గ‌త నెల విడుద‌ల కావ‌ల్సిన ఈచిత్రాన్ని ఈనెల 7న తీసుకొస్తామ‌న్నారు. కానీ ఇంత వ‌ర‌కూ కార్యరూపం దాల్చలేదు. చివ‌రికి ఈనెల 27న రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కావ‌డం లేదు. ఈనెల 27న భీమ‌వ‌రం బుల్లోడు రావ‌డం లేద‌ని లేటెస్ట్ న్యూస్‌. సీమాంధ్ర గొడ‌వ‌ల కార‌ణంలోనే భీమ‌వ‌రం బుల్లోడు సినిమాని వాయిదా వేశార‌ని స‌మాచార‌మ్‌. తెలంగాణ గొడ‌వ తేలేదాకా… ఈ చిత్రాన్ని బ‌య‌ట‌కు తీసుకురార‌ట‌. మ‌రి ఆ గొడ‌వ ఎప్పుడు స‌ద్దుమ‌నుగుతుందో, ఈ సినిమా ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో…?

Exit mobile version