భీమ్లా నాయక్ టాక్ : పవర్ ప్యాక్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఈరోజు కు వాయిదా పడింది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.

మలయాళ చిత్రం అయ్యప్పనుం కోశియుమ్ కు రీమేక్ రావడం..మలయాళం ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం తో..భీమ్లా నాయక్ ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక థమన్ మ్యూజిక్ ఆదరిపోవడం , ట్రైలర్స్ , వీడియోస్ సూపెర్గా ఉండడం తో సినిమా ఫై ఆసక్తి రెట్టింపు అయ్యింది. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? సాగర్ పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాడు ..? థమన్ బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంది..? త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ఎలా ఉన్నాయి..? ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు..? అభిమానులు ఏమంటున్నారు..? అనేవి ఇప్పుడు చూద్దాం.

ఇప్పటికే అన్ని చోట్ల బెనిఫిట్ షోస్ పూర్తి కావడం తో సినిమా ఎలా ఉందనేది అభిమానులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారు చెప్పిన దాని ప్రకారం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు ఎక్కడ కూడా తగ్గలేదని, ఇద్దరినీ సమానంగా చూపించారని అంటున్నారు. థమన్ మ్యూజిక్ మరోసారి కుమ్మేసిందని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు చెవులు పగిలిపోతున్నాయని అంటున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ సూపర్బ్ చించేశాయని, పవర్ స్టార్ కు పవర్ ఫుల్ డైలాగ్స్ రాసాడని చెపుతున్నారు. సాగర్ డైరెక్షన్ కేక పుట్టించిందని , ఇక క్లయిమాక్స్ థియేటర్స్ లలో విజిల్ వేయించిందని అంటున్నారు. మరికొంతమంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కుమ్మేసిందని అంటున్నారు. ఓవరాల్ గా ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఇద్దరు హీరోలు గెలిచారని చెపుతున్నారు.