Site icon TeluguMirchi.com

అసలైన ఫెస్టివల్ మొదలైంది

కరోనా కారణంగా చిత్రసీమ లో సినీ సందడి కరువయ్యింది. కరోనా తరువాత చాల సినిమాలే వచ్చినప్పటికీ అసలైన సినీ సందడి మాత్రం మొదలు కాలేదు. కానీ ఈరోజు అసలైన ఫెస్టివల్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ అవ్వడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది. ఇప్పటికే చాల చోట్ల బెనిఫిట్ షోస్ పూర్తి కావడం తో సినిమా చూసిన ప్రేక్షకులు , అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అని తేల్చి చెపుతున్నారు. ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెపుతున్నారు.

ఇటీవల కాలంలో థమన్ ఎలాంటి మ్యూజిక్ చేసినా కూడా ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. థియేటర్స్ లో కూడా థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచిందని కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. ఇక ఈ మూవీ కి కూడా థమన్ కుమ్మేసాడని , థియేటర్స్ లలో స్పీకర్లు పగిలిపోతున్నాయని అంటున్నారు.

భీమ్లా నాయక్ సినిమా మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చిందని అంటున్నారు. విడుదలకు ముందు విడుదల చేసిన సెకండ్ ట్రైలర్ కూడా అంచనాల డోస్ ను మరింత పెంచేయడం, ప్రీ రిలీజ్ అదిరిపోవడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. ఓవరాల్ గా భీమ్లా నాయక్ తో చిత్రసీమ కు మళ్లీ సందడి మొదలైనట్లు చెపుతున్నారు.

Exit mobile version