నిర్మాతతో భావన నిశ్చితార్ధం

bhavana
మలయాళ ముద్దుగుమ్మ భావన తెలుగులో ‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పు’ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులకు సుపరిచితం అయ్యింది. తాజాగా ఈ అమ్మడు కారులో తననెవరో కిడ్నాప్‌ చేసి ఆపై లైంగిక దాడులకు పాల్పడ్డారు అంటూ ఇటీవల చాలా పెద్ద రచ్చ చేసింది. ఈ వివాదం ఇంకా ప్రేక్షకులే మరవనేలేదు అప్పుడే పెళ్లి గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ అమ్మడు ఓ ఇంటర్య్వూలో తాను యువ నిర్మాతతో ప్రేమలో ఉన్నాని స్పష్టం చేసింది. ఆ తర్వాత తాను నిర్మాతను ప్రేమించడం వల్లనే ఒక హీరో తనపై ఇలా దాడి చేయించాడు అని, తనకు న్యాయం చేయాలి అంటూ పోలీసులను ఆశ్రయించింది.

భావన ప్రేమ విషయమై ఇంత రచ్చ జరిగిన తర్వాత ఆ ప్రేమ నిలుస్తుందా…? వారిద్దరికి పెళ్లి జరుగుతుందా…?? అని అందరికి అనుమానాలు ఉండేవి. కాని తాజాగా ఈ అమ్మడికి నిర్మాత నవీన్‌కు నిశ్చితార్థం జరిగింది. భావన నిశ్చితార్థానికి హాజరైన పలువురు మలయాళ తారలు భానన నిశ్చితార్థం ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి తేదీని ఇంకా నిర్ణయించుకోలేదని, చాలా సింపుల్‌గా నటి భావన, నిర్మాత నవీన్‌ల నిశ్చితార్థం జరిగిందని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మొన్నటి దాకా లైంగిక దాడుల వివాదంలో చిక్కుకున్న భావన నిశ్చితార్థం ఇంత త్వరగా అవడంతో ప్రేక్షకులు షాక్‌ అవుతున్నారు.