Site icon TeluguMirchi.com

చిరు కోసం భారీ సెట్..

అదేంటి సైరా చిత్ర షూటింగ్ అంత పూర్తి అయ్యింది కదా..మళ్లీ సెట్ ఏంటి అని అనుకుంటున్నారా…ఇది చిరు నెక్స్ట్ సినిమాకోసం..సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సైరా చిత్ర షూటింగ్ అంత పూర్తి కావడం తో..ఇప్పుడు చిరు నెక్స్ట్ మూవీ ఫై ఫోకస్ పెట్టాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో చిరు తన 152 వ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ సిద్ధం చేసి సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆగస్టు నెలాఖరు లేదా, సెప్టెంబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. గతంలో రంగస్థలం సినిమా కోసం విలేజ్ సెట్ వేసిన ప్రదేశం పక్కనే ఖాళీ స్థలంలో రెండు మూడు ఇళ్ల భారీ సెట్ నిర్మాణం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ విడుదల టార్గెట్ గా ఈ సినిమా రెడీ చేస్తారని టాక్.

ఇక సైరా విషయానికి వస్తే దసరా కానుకగా అక్టోబర్ 02 న విడుదల చేయబోతున్నారు. కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ ఫై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version