భరత్ అనే నేను ఉత్తరాంధ్ర కలెక్షన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు , కైరా అద్వానీ జంటగా కొరటాల శివ కాంబినేషన్ లో డీవీవీ దానయ్య నిర్మాణం లో తెరకెక్కిన భరత్ అనే నేను గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండేళ్ల తర్వాత మహేష్ హిట్ కొట్టడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు పెడుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా ఉత్తరాంద్ర ఏరియా 5వ రోజు కలెక్షన్స్ చూస్తే రూ. 47.8 లక్షల షేర్ వసూలు చేసి, మొత్తంగా రూ.6.18 కోట్లు షేర్ కొల్లగొట్టిందని ట్రేడ్ పండితులు చెపుతున్నారు. కాగా ఈ వారాంతంలో ఈ సినిమా రూ.7 కోట్ల మార్కు చాలా ఈజీ గా అందుకుంటుందని తెలుస్తోంది.