Bharateeyudu 2 : ‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల..?


యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

NKR21 : మళ్ళీ ‘వైజయంతి IPS’ గా విజయశాంతి.. ఫస్ట్ లుక్ అదుర్స్ !

‘భారతీయుడు 2’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయగా.. అందులో ట్రాలీ బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతున్న క‌మ‌ల్ హాస‌న్ కనిపిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ మెప్పించారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ‘భారతీయుడు 2’ రానుంది. దీంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బ్ర‌హ్మానందం, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.