Site icon TeluguMirchi.com

మహేష్ మొదటిసారి రికార్డు కొట్టాడు..

రెండేళ్ల తర్వాత మహేష్ అసలుసిసలైన హిట్ కొట్టాడు. తన కెరియర్ లో శ్రీమంతుడు ఎంతటి హిట్ గా నిలిచిందో ఇప్పుడు భరత్ అనే నేను దానిని రెట్టింపు విజయం సాధించి , మహేష్ కు ఓ మైలు రాయి చిత్రం గా నిలిచిపోయింది. కొరటాల శివ డైరెక్షన్లో డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


విడుదలైన మొదటి రోజునుండే బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త కలెక్షన్స్ సాధిస్తూ బాహుబలి తర్వాత అంత ఫాస్ట్ గా కలెక్షన్స్ సాధించిన చిత్రం గా నిలిచింది. ముఖ్యం గా ఓవర్సీస్ మహేష్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. కేవలం వారం రోజుల్లో మూడు మిలియన్ల సాధించి , మొదటిసారి మహేష్ ఓవర్సీస్ లో ఆ రికార్డు కొట్టాడు.

వరల్డ్ వైడ్‌గా రూ. 161.28 కోట్లు రాబట్టింది. మొదటి వారం ఇండియాలో రూ. 130.22 కోట్ల గ్రాస్ రాబట్టిన భరత్.. ఓవర్సీస్‌లో రూ. 31.06 కోట్లు వసూలు చేసింది. వేసవి కానుకగా విడుదలైన రంగస్థలం 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బాహుబలి-1, బాహుబలి-2, రంగస్థలం చిత్రాల తర్వాత అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా భరత్ నిలిచింది.

Exit mobile version