Site icon TeluguMirchi.com

భరత్ ఫస్ట్ వీక్ యూఎస్ కలెక్షన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను విజయవంతం గా మొదటి వారం పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 20 న విడుదలైన ఈ మూవీ నేటికీ మొదటివారం పూర్తి అయ్యింది. విడుదలైన రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఓవర్సీస్ లో భరత్ హావ ఓ రేంజ్ లో ఉందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. అమెరికాలో మొదటి ఐదు రోజుల్లో(‍ప్రివ్యూస్‌తో కలుపుకుని) రూ. 17.91 కోట్లు వసూలు చేసి రూ. 20 కోట్ల మార్క్‌ దిశగా దూసుకవెళ్తున్నట్లు తెలిపాడు.

ఆస్ట్రేలియాలోనూ ‘భరత్‌..’ సందడి ఓ రేంజ్ లో ఉందని, మొదటి ఐదు రోజుల్లో రూ. 2.02 కోట్లు వసూలు చేసినట్టు చెప్పుకొచ్చాడు. కేరళలో మొదటి 5 రోజుల్లో రూ. 7.63 లక్షలు తెచ్చు​కుంది. ఓవరాల్ గా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఓవర్సీస్ లో రోజు వారి కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

Telugu film #BharatAneNenu continues to trend strongly on weekdays in USA…
Thu previews + Fri $ 1,401,453
Sat $ 697,592
Sun $ 369,022
Mon $ 79,635
Tue $ 126,799
Total: $ 2,674,501 [₹ 17.91 cr]

Exit mobile version