Site icon TeluguMirchi.com

భరత్ లేటెస్ట్ ‘ కృష్ణా ‘ కలెక్షన్స్..

మహేష్ బాబు రెండేళ్ల దాహాన్ని భరత్ అనే నేను తో తీర్చుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ , ఆ తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తుంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసిన భరత్ , ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మంచి వసూళ్లు కనపరుస్తున్నాడు. మొదటిరోజు రూ.1.92 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ఆదివారం రోజున రూ.81 లక్షల షేర్ తో మొత్తంగా మూడు రోజులకు కలిపి రూ.3.37 కోట్లు అందుకుంది.

అలాగే గుంటూరు జిల్లాలో తొలిరోజు రూ.4.03 కోట్ల షేర్ ను కొల్లగొట్టిన ఈ సినిమా ఆదివారం రూ.86 లక్షలు వసూలు చేసి మూడు రోజులకు కలిపి రూ.5.57 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి -2 రికార్డును కైవసం చేసుకుంది.

Exit mobile version