Site icon TeluguMirchi.com

భరత్ అనే నేను సెన్సార్ కు శ్రీ రెడ్డి అడ్డు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.. శ్రీమంతుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం , మొదటి సారి ముఖ్య మంత్రి పాత్రలో మహేష్ కనిపించడం , ట్రైలర్ సైతం ఆసక్తిగా ఉండడం తో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్య క్రమాలు నిన్న (ఏప్రిల్ 12) పూర్తి కావాల్సి ఉండాలి. కానీ చివరి నిమిషం లో సెన్సార్ వాయిదా వేశారు. సోమవారం తరువాతే సెన్సారుకు ఇస్తారని తెలుస్తోంది. లాస్ట్ మినిట్ టెన్షన్లు, చిన్న చిన్న పనుల్లో డైరక్టర్ కొరటాల శివ బిజీగా వున్నారు. ఇదే టైమ్ లో ఆయన కూడా శ్రీరెడ్డి చాటింగ్ లిస్ట్ లో ఉన్నారనే వార్త బయటకు రావడం ఇవన్నీ కూడా సెన్సార్ కు వాయిదా కు కారణమని అంటున్నారు. అసలు నిజం అనేది ఏంటో తెలియాలి.

Exit mobile version