పాపం… భాయ్‌

bhaiప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ – సినిమాల‌న్నీ సీమాంధ్ర ఉద్యమ సెగ వ‌ల్ల మూల‌న ప‌డ్డాయి. ఇంకేముంది, నా సినిమాని రంగంలోకి దించి క్యాష్ చేసుకొందాం అనుకొన్నాడు నాగార్జున‌. ‘భాయ్’ సినిమాని అక్టోబ‌రు మొద‌టి వారంలో తీసుకొస్తే సొమ్ములే సొమ్ములు అనేది నాగ్ వ్యూహం. అయితే ఇప్పుడ‌ది బెడ‌సికొట్టింది. అత్తారింటికి దారేది – రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాలు పోటా పోటీగా అక్టోబ‌రు 9, 10 తేదీల్లో వ‌చ్చేస్తున్నాయి. దాంతో నాగ్‌ లో కంగారు మొద‌లైంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య భాయ్ ఇమ‌డ‌లేడ‌న్నది సుస్పష్టం. అందుకే, త‌న సినిమాకి వెన‌క్కి తీసుకెళ్లాలి. లేదంటే ముందె అనుకొన్న డేటు కంటే వారం రోజులు ముందే సినిమాని తీసుకురావాలి. నాగ్ ముందున్న మార్గం ఇదే. ఈనెల చివ‌రి వారంలో సినిమాని తీసుకొచ్చేయ‌డం బెట‌ర్‌. లేదంటే ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ సినిమాలు వెళ్లాక తీరిగ్గా రావాలి. ఆ లెక్కన ఈ సినిమా డిసెంబ‌రుకి వెళ్లిపోతుందేమో…?