Site icon TeluguMirchi.com

భాగమతి టీజర్ టాక్…హర్రర్ భాగమతి

ఎంతో కాలంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భాగమతి టీజర్ వచ్చేసింది. ముఫైమూడు సెకెండ్ల నిడివి తో ఈ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తే భాగమతి హర్రర్ జోనర్ లో రాబోతుందని తెలుస్తుంది. భారీ భవంతి లో అనుష్క ఓ టార్చి పట్టుకొని ఏదో వెతుకుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత ఓ గోడకు అనుష్క తనకు తానే చెతిలో మేకులు కొట్టుకోవడం టీజర్ లో చూపించారు. ఎందుకు ఇలా కొట్టుకుంది అనే ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసారు. ట్రయిలర్ జనవరి ఫస్ట్ వీక్ లో విడుదల చేయబోతున్నారు. అలాగే జనవరి 26 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసురావడానికి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

‘బాహుబలి’ సినిమా తరువాత అనుష్క చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ కి , మది కెమెరా మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ మూవీ కి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక మీరు కూడా టీజర్ ఫై లుక్ వెయ్యండి.

Exit mobile version