యువనటుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. కాగా బిగ్ బెన్ సినిమా, సినీ వాల్లే మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు. ఇక జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు.
ఇక ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఎంతో సరదాగా సాగింది. ముఖ్యంగా యాక్షన్, కామెడీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగున్నాయి. అంతేకాదు ట్రైలర్‌తోనే సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. ‘పొద్దున్నే తిన్నోడు మధ్యాహ్నం తినక మానడు. మధ్యాహ్నం తిన్నోడు రాత్రి తినకమానడు ఇదెప్పుడు రన్నింగ్‌లో ఉండే బిజినెస్ నాన్న’, ‘కేసీఆర్‌కు తెలంగాణ ఎంతిష్టమో నువ్వంటే అంత ఇష్టం’. ‘క్వీన్ పోయి కింగ్ ఏడుస్తుంటే.. ఉంచుకొన్నదొచ్చి రింగ్ అడిగిందంట’ అనే డైలాగ్స్ సినిమా ఎంత కామెడీ వేలో సాగుతుందో స్పష్టం చేశాయి. మొత్తానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో జూలై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.