‘ నాయక్ ‘ ‘ సీతమ్మ ‘ ల కు బెట్టింగ్ జోరు….?

Seethamma vakitlo sirimalle chettu movie review Nayak movie review 1సాధారణంగా క్రికెట్ లో బెట్టింగుల జోరు చూస్తూంటాం. ప్రత్యేకించి ఇండియా, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ అంటే ఈ జోరు పరాకాష్టకు చేరుకుంటుంది. ఈ పందాలు కోట్లల్లో వుంటాయి. ఈ బెట్టింగుల ఆరోపణలతో పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా బజారుద్దిన్ లు అయిపోయారు. క్రమేపి ఇది మామూలు విషయంగా మారిపోయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ జాడ్యం ప్రస్తుతం టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. ఇప్పటివరకు పెద్ద హీరోలసినిమాలు విడుదల అవుతుంటే ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అని ఆ హిరో అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఎదురుచూసేవి. కాని ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో ప్రస్తుతం ఈ బెట్టింగ్ మహమ్మారి పరిశ్రమలోకి కూడా ప్రవేశించటం ఇండస్ట్రీ పెద్దలను సైతం కలవరానికి గురిచేస్తోంది. ఈ నెల 9 వ తేదిన రామ్ చరణ్ తేజ నటించిన ‘ నాయక్ ‘, 11 వ తేదిన మహేశ్ బాబు, వెంకటేష్ నటించిన ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాలు విడుదల అవుతున్నాయి. రెండు సినిమాలూ అగ్రహీరోలు నటించినవే. రెండిటి మీద అటు ఆయా హీరోల ఫ్యాన్స్ లోనూ, ఇటు పరిశ్రమలోనూ మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఆ రెండు సినిమాల ఆడియోలు రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్నాయి. రెండు సినిమాలు భారీ వ్యయంతో నిర్మించినవే.

Nayak Movie Review 6‘ రచ్చ ‘ తరువాత రామ్ చరణ్ తేజ నటించిన సినిమా కావటంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరం ‘ నాయక్ ‘ సూపర్ హిట్ తో మొదలవుతుందని వాళ్ళు కోటి ఆశలతో వున్నారు. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమా మొత్తం రషెస్‌ చూసిన ఆయన దర్శకుడు వి.వి.వినాయక్ కు కొన్ని సూచనలు కూడా చేసారు. ఆయన చేసిన సూచనల మేరకు వినాయక్ ఆ మార్పులను కూడా చేసారని తెలిసింది. ‘ నాయక్ ‘ సినిమా
సెన్సార్ రిపోర్టు కూడా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డులను సృష్టిస్తుందని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక సంఖ్యలో థియేటర్లలో 9 న విడుదల కాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నైజాం హక్కుల్ని స్వంతం చేసుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమా తరువాత రెండురోజుల్లో విడుదల కాబోతున్న ‘ సీతమ్మ వాకిట్లో….’ సినిమాకు దిల్ రాజే నిర్మాత. నైజాం లో ‘ నాయక్ ‘ సినిమా ను ఆయన 300 థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఒక్క జంటనగరాల్లోనే 110 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రోమో లలో చరణ్ డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు ఇప్పటికే బాగా ఆకట్టుకుంటూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నాయి.

Seethamma vakitlo sirimalle chettu movie review 4ఇదిలా వుంటే చాలాకాలం తరువాత తెలుగులో వస్తున్న మల్టీస్టారర్ సినిమా ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ” విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలు నటించిన సినిమా కావటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో వున్నాయి. సుదీర్ఘకాలం పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కేవలం యూత్ ను మాత్రమే కాక కుటుంబం మొత్తాన్ని ఆకట్టుకునే విధంగా
రూపొందిందని నిర్మాతలు చెపుతున్నారు. పైగా ఈ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెలుగు ప్రేక్షకులు చూసి చాలాకాలమైంది. మహేష్, వెంకటేష్ ఇద్దరికీ ఫ్యామిలీ హీరోలుగా పేరుంది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అత్యంత భారీగా నిర్మించినట్టు సమాచారం. హీరోయిన్లు సమంత, అంజలి ఇద్దరూ మంచి ఫాలోయింగ్ వున్న కదానాయికలే.

Seethamma vakitlo sirimalle chettu movie review Nayak movie review 2ప్రత్యేకత ఏమిటంటే 2012 లో రామ్ చరణ్ నటించిన ‘ రచ్చ ‘ మాత్రమే విడుదలయింది. అలాగే మహేష్ కు ‘ బిజినెస్ మ్యాన్ ‘, వెంకటేష్ కు ‘ బాడిగార్డ్ ‘ సినిమాలు మాత్రమే రిలీజయ్యాయి. ముగ్గురు హీరోల సినిమాలకు బాగా గ్యాప్ వుంది. ఇంత గ్యాప్ తరువాత విడుదలవుతున్న సినిమాలు కావటంతో సహజంగానే ఈ సినిమాల పట్ల అంచనాలు ఊహించనంత రీతిలో పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా హిట్ అవుతుంది అనే విషయమై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇద్దరు హీరోల అభిమానులు తమ హీరో సినిమా హిట్ అవుతుందని ధీమాగా వున్నారు. ఈ నేపధ్యంలో ఈ బెట్టింగ్ సీన్ టాలివుడ్ లోకి ఎంటర్ అయినట్టు సమాచారం. హైదరాబాద్, విశాఖపట్నం , తిరుపతి పట్టణాల్లోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఏ సినిమా హిట్ అవుతుంది అనే అంశంపై జరుగుతున్న ఈ బెట్టింగ్ లక్షల్లో కొనసాగుతోంది అని విశ్వసనీయంగా తెలిసింది. సంక్రాంతి సందర్భంగా కోడిపందాల గురించి విన్నాం కాని కొత్తగా సంక్రాంతి సినిమాల విడుదల సందర్భంగా ఈ బెట్టింగ్ జోరు
మొదలవటం ఇదే మొదటి సారి. ఈ జోరు ఏ మేరకు కొనసాగుతుందో చూడాలి మరి….

Viswaroopam Stuck in between Nayak and Seethamma vakitlo Sirimalle chettuకొసమెరుపు ఏమిటంటే ఈ రెండు సినిమాల మధ్య సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ నిర్మించి నటించిన ‘ విశ్వరూపం ‘ సినిమా కూడా 11 వ తేదీనే విడుదల అవుతోంది. అయితే ఈ రెండిటి విశ్వరూపం ముందు కమల్ ‘ విశ్వరూపం ‘ నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా కూడా అత్యంత భారీ వ్యయంతో నిర్మించిందే..కమల్ కు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వుంది. అయితే ఈ సారి మాత్రం కమల్ సినిమా పట్ల అంచనాలూ లేవు…విడుదలకు థియేటర్లు కూడా లేవు.