మాస్ మహరాజ రవితేజ కథానాయకుడిగా, తమన్నా, రాశిఖన్నా లు కథానయికలుగా, సంపత్‌నంది దర్శకునిగా , ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం బెంగాల్‌టైగర్ దాదాపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు డబ్బింగ్, సిజి వర్క్స్ జరుపుకుంటుంది. బీమ్స్ సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని అక్టోబర్ లో విడుదల చేసి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ” బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ కార్కక్రమాలు దాదాపు పూర్తిచేసుకున్నాము.అనుకున్న విధంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా చిత్ర యూనిట్ అందరి సహయంతో పూర్తిచేశాము. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ అందరిమీ మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవల మా బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ రావటమే కాకుండా హీరో రవితేజ గారు లుక్ చాలా ఎనర్జిటిక్ గా వుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ గారి యంగ్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటారు. దర్శకుడు సంపత్ నంది ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. రవితేజ గారిని ఎలా చూపించాలో పక్కాగా అలాగే స్క్రీన్ మీద చూపించారు. ఈ విషయం రేపు చూసిన అభిమానులు చెప్తారు. ఈచిత్రం రవితేజ గారి కెరీర్ లో బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ గా నిలుస్తుందని మా నమ్మకం. ఇటీవలే స్విజ్జర్‌లాండ్ లో రెండు పాటల చిత్రీకరణ చేశాము. స్విజ్జర్‌లాండ్ లో ఎప్పుడూ ఎవ్వురూ చెయ్యని అందమైన లోకేషన్స్ లో పాటల్ని చిత్రీకరించాము. హర్ష మాస్టర్ రెండు పాటలకి కొరియోగ్రఫి ని అందించారు. ఓ పాట రవితేజ, రాశిఖన్నా మీద, మరో పాట రవితేజ, తమన్నా లపై చిత్రీకరించాము. ఈ రెండు పాటలు అందరిని అలరిస్తాయి. బీమ్స్ అందించిన ఆడియోని అక్టోబర్ లో విడుదల చేస్తున్నాము. అతి త్వరలో ఆడియో డేట్ ని ప్రకటిస్తాము.” అని అన్నారు
దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ”మాస్ మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా లు జంటగా చేస్తున్న మా బెంగాల్‌టైగర్ చిత్రం
పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాల్లో బిజిగావుంది. రవితేజ గారి నుండి ఆడియన్స్ ఎలాంటి ఎనర్జి కోరుకుంటారో అదే తెరపై చూపించటం జరిగింది. బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ లో కూడా రవితేజ గారి లుక్ కి రెస్పాన్స్ సూపర్ గా వచ్చింది. ఈ రెస్పాన్స్ మా సినిమాకి కూడా వస్తుంది. స్విజ్జర్‌లాండ్ లో అందమైన లొకేషన్స్ లో రెండు సాంగ్స్ చిత్రీకరించాము. నిర్మాత రాధా మోహన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథకి ఏం కావాలన్నా అడిగిన వెంటనే అందించారు. ఆయన సినిమా అంటే ఫ్యాషన్ వున్న నిర్మాత. తమన్నా, రాశిఖన్నాలు చిత్రానికి అందాన్ని తెచ్చారు. భీమ్స్ అందించిన ఆడియో అక్టోబర్ లో విడుదల చేయనున్నాము. బోమన్ ఇరాని నటన చిత్రానికి హైలెట్ గా వుంటుంది. బోమన్ ఇరానితో పాటు రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మా బెంగాల్ టైగర్ ఆకట్టుకుంటుంది” అని అన్నారు
ఈ చిత్రలో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటించగా..
బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి,వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం భీమ్స్
నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.