ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్ కొన్ని కారణాల వల్ల నిర్మాణంకు దూరం అయ్యాడు. ఆర్థికపరమైన విషయాలతో పాటు ఇతరత్ర విషయాల కారణంగా నిర్మాణంకు దూరంగా ఉన్న బెల్లంకొండ సురేష్ తన కొడుకును మాత్రం టాలీవుడ్లో టాప్ హీరోగా నిలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. డబ్బుకు వెనకాడకుండా వెనకా ఉండి ఇతర నిర్మాతలతో సినిమాలు చేయించాడు. ఎన్నో సినిమాలు చేసినా కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు మాత్రం సక్సెస్ పడలేదు.
ఎట్టకేలకు ‘రాక్షసుడు’ చిత్రంతో బెల్లంకొండ శ్రీనివాస్‌కు సక్సెస్ దక్కింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం సక్సెస్ అవ్వడంతో బెల్లంకొండ వారి ఇంట సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ నార్త్‌లో బెల్లంకొండకు మంచి క్రేజ్ ఉంది. స్పీడున్నోడు మరియు కవచం చిత్రాలు అక్కడ ఏకంగా కోటి వ్యూస్‌ను యూట్యూబ్‌లో దక్కించుకుంది. అందుకే అక్కడి ప్రేక్షకుల ముందుకు శ్రీనివాస్‌ను తీసుకు పోయే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సురేష్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే తన కొడుకును బాలీవుడ్‌కు సురేష్ తీసుకు వెళ్లేలా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎక్కువ శాతం బాలీవుడ్లో సక్సెస్ కాలేదు. అందుకే స్టార్స్ ఎవరు అటు వెళ్లేందుకు ఇష్టపడరు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ అక్కడ సక్సెస్ అవుతాడా చూడాలి.