ఎట్టకేలకు బోయపాటి మొదలెట్టాడు..

boyapati__bellamkonda_sriniస్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సర్రైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను , కాస్త గ్యాప్ తీసుకోని ఎప్పటినుండో పక్కకు పడేసిన కథకు బూజు దులిపేపని పెట్టుకున్నాడు. ‘అల్లుడు శ్రీను ‘ చిత్రం తో తెలుగు తెర కు పరిచయం అయినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా ని బోయపాటి ఎప్పుడో అనుకున్నాడు..కానీ అది సెట్స్ ఫైకి మాత్రం రాకుండా అలాగే ఉండి పోయింది. దానికి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించాడు.

ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ఈ సినిమా కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశంపై బోయపాటి శ్రీను కూతురు జోషిత క్లాప్ కొట్టగా .. ఆయన కుమారుడు హర్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. రవీందర్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరుపుకోబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ మూవీ లో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా అలరించనుంది.