యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కమర్షియల్‌గా సక్సెస్‌ను దక్కించుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నాడు. ఎన్నో సినిమాలను చేసిన ఇతడు ఇటీవల చేసిన రాక్షసుడు చిత్రంతో కాస్త పర్వాలేదు అనిపించాడు. విభిన్నమైన తరహా సినిమాలను చేస్తూ ఉంటే తప్పకుండా నటుడిగా క్లిక్ అవ్వడంతో పాటు, మంచి సక్సెస్‌లు కూడా వస్తాయని నమ్ముతున్నాడు. అందుకే తన తదుపరి చిత్రం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
యూత్‌ఫుల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని చేసేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సిద్దం అయ్యాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన చర్చ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున సినిమాను తెరకెక్కించకుండా ఒక మోస్తరు బడ్జెట్‌తో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ట్రై చేయని కొత్త జోనర్‌లో సాయి శ్రీనివాస్ ప్రయత్నించబోతున్నాడు. మరి ఈసారి అయినా సక్సెస్ దక్కేనా చూడాలి.