Site icon TeluguMirchi.com

Bellamkonda Sreenivas : ‘టైసన్ నాయుడు’ గా బెల్లంకొండ పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ విడుదల


ప్రామిసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. #BSS10 తాత్కాలిక టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ను బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాక్సింగ్ ఎక్స్ పర్ట్, లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. అంతేకాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మజల్ద్ బాడీ, గడ్డంతో మాస్‌గా కనిపించి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ బ్లాక్ ఇంటెన్స్, ఫేరోషియస్ గా వున్నాయి. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tyson Naidu First Glimpse | Sreenivas Bellamkonda | Saagar K Chandra | 14 Reels Plus

Exit mobile version