‘బెదురులంక 2012’ ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధం !


టీజర్ మరియు ఇతర పోస్టర్స్ ద్వారా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేపిన కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి ల చిత్రం ‘బెదురులంక 2012’ భారీ అంచనాల మధ్య జూన్ లో ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధంగా ఉంది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ చిత్రాన్ని నిర్మించిన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని, చిత్ర సమర్పకులు సి. యువరాజ్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.

క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్ర కథ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం, కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్, గోదావరి తీర ప్రాంతం, ఆద్యంతం నవ్వించే కామెడీ, ఇలా ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో టీజర్ లో ఇదివరకే చూపించేసారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్రం పై పూర్తి నమ్మకంతో ప్రపంచవ్యాప్త విడుదల చేస్తున్నాము. ఇది ‘ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్’ అవుతుంది. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే ‘బెదురులంక 2012’ ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అన్నారు.