Site icon TeluguMirchi.com

Bedurulanka 2012 : వినోదంతో పాటు ఆలోచించేలా ‘దొంగోడే దొరగాడు’ సాంగ్..


కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల..’, ‘సొల్లుడా శివ..’ పాటల్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో మూడో పాట ‘దొంగోడే దొరగాడే’ ను విడుదల చేశారు.

”లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే..
ఎవడికాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే..
ఇల్లు వొళ్ళు గుల్లే చేసే బేరం ఇదిగో.. పట్టేసేయ్..
అడిగేటోడు ఎవడూ లేడు, అంతా నీదే లాగేసేయ్..
కొట్టేయి తాళం.. తీసేయి గొళ్ళెం..
దొరికిందంతా దోచేయ్ రా..
పట్టిస్తారు హారతి పళ్లెం..
దర్జాగా ఖాళి చెయ్యండ్రా..
దొంగోడే దొరగాడు.. దొంగోడే దొరగాడు..
దొంగోడే దొరగాడు.. దొంగోడే దొరగాడు”
అంటూ సాగిన ఈ గీతాన్ని సాహితి చాగంటి ఆలపించారు. కిట్టూ విస్సాప్రగడ రాశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

ఓ మతం, ఓ ఆచారం, ఓ సంప్రదాయం అని కాదు.. ప్రతి ఊరిలో, ప్రతి చోట మతం పేరుతో మనుషుల్ని దోచుకునే మోసగాళ్లు ఉన్నారని చెప్పే గీతమిది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఏం జరుగుతుందో చూపించినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.

Exit mobile version