సొంత క‌థ‌లు రాసుకోరా…?

Bimineni_Srinivasభీమ‌నేని శ్రీ‌నివాస‌ర‌రావుకి ఓ అల‌వాటుంది. ప‌క్క భాష‌లో ఇర‌గాడేసిన సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌డం. ఆయ‌న చేసిన సినిమాల‌న్నీ దాదాపుగా అలాంటివే. హిట్లూ వ‌చ్చాయ‌నుకోండి. కొన్ని ఫ‌ట్ మ‌న్నాయి కూడా. మొన్నామ‌ధ్య సుడిగాడుతో హిట్ కొట్టారు. అదీ రీమేక్ క‌థే. మ‌రోసారి భీమ‌నేని రీమేక్‌నే న‌మ్ముకొన్నారు. త‌మిళంలో హిట్టయిన సుంద‌ర పాండ్యన్‌ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సునీల్ క‌థానాయ‌కుడు. ”రీమేక్ క‌థ‌లే చేస్తున్నాన‌నే పేరుంది. అయితే అందులో రిస్క్ తక్కువ‌. నేనేం మ‌క్కీకి మ‌క్కీ దించేయ‌డం లేదు. సొంత ఆలోచ‌న‌లు కూడా జోడిస్తుంటా క‌దా…” అంటుంటారు భీమ‌నేని. కొత్త క‌థ రాసుకొంటే క‌దా.. టాలెంట్ తెలిసేది. మ‌రి ఈ ద‌ర్శకుడు సొంత క‌థ‌తో ఎప్పుడు మెరుపులు మెరిపిస్తాడో మ‌రి.