Site icon TeluguMirchi.com

Family Star : “ఫ్యామిలీ స్టార్” నుంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ !


స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ఫిల్మ్ “ఫ్యామిలీ స్టార్”. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈరోజు ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ రిలీజ్ చేశారు మేకర్స్.

‘నందనందనా..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కంపోజిషన్ లో అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా సిధ్ శ్రీరామ్ పాడారు. ‘ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చీ గిచ్చకా..ప్రాణాన్ని గుచ్చీ గుచ్చకా..చిత్రంగా చెక్కింది దేనికో..’ అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్ చాలా అద్భుతంగా వుంది. ఈ లిరికల్ వీడియోతో ‘నందనందనా..’ పాట “ఫ్యామిలీ స్టార్” మూవీకి ఒక స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో వుంది.

Lyrical Video: Nandanandanaa | The Family Star | Vijay Deverakonda,Mrunal T | Gopi Sundar |Parasuram

Exit mobile version