Site icon TeluguMirchi.com

బాహుబలి2.. రూ.1000కోట్ల వెరీ ఈజీ

‘బాహుబలి ది: బిగినింగ్‌’కు కొనసాగింపుగా వచ్చిన ‘..కన్‌క్లూజన్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’ రికార్డుల మోత మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు గ్రాస్‌ కల్షన్లు రెండు వందల కోట్లు దాటేసాయి. తాజాగా మూడు రోజుల్లోనే రూ.500కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటి వరకూ భారత సినీ చరిత్రలో ఈ స్థాయిలో రికార్డుల్ని సృష్టించిన తొలి చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ కావడం విశేషం. చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ బారులు తీరుతున్నారని రిపోర్ట్స్‌ వస్తోన్న నేపథ్యంలో ఈ ప్రభంజనం కనీసం మరో వారం పాటయినా సాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కలెక్షన్ల సునామీతో ‘బాహుబలి’ ఈజీగా రూ.1000కోట్లకు చేరుకుంటుందని అంచనా.

Exit mobile version