Site icon TeluguMirchi.com

చైతు సరసన సామ్ కదా..?

నాగ చైతన్య – సమంత ల కాంబినేషన్ అంటే అది హిట్ అని అభిమానులు నమ్ముతారు. వీరిద్దరి కాంబో లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడం తో ఈ జంట ఫై అభిమానుల్లోనే కాదు దర్శక , నిర్మాతల్లోను ఓ నమ్మకం. రీసెంట్ గా వచ్చిన మజిలీ సైతం మంచి హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ బంగార్రాజు లో చైతు సరసన సమంత ను నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడేమో సామ్ బదులు కీర్తి సురేష్ ను అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

నాగార్జున, రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “సోగ్గాడే చిన్నినాయనా” మంచి విజయాన్ని అందుకొంది. నాగార్జున కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఐతే నాగార్జున ఈ విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ గా “బంగార్రాజు” మూవీ తెరకెక్కబోతుంది. అలాగే ఈ మూవీలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని సమాచారం. నాగ్ కుటుంబంలోని నటులందరూ కనిపించేలా ‘మనం’ తరహా కథను దర్శకుడు “కళ్యాణ్ కృష్ణ” సిద్ధం చేస్తున్నారట. మరినిజంగా నే సామ్ నటించడం లేదా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version