Site icon TeluguMirchi.com

రాజమౌళి బందోబస్త్ ..

సూర్య‌, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌, ఆర్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రంగం ఫేమ్ కేవీ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం క‌ప్పాన్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘కప్పాన్‌’ మూవీ తెలుగు లో బందోబస్త్ పేరిట తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తమిళ ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకోగా..తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శక ధీరుడు రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడిగా కనిపించబోతున్నాడు.

స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగ‌ల్ హీరోయిన్. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version