బ‌ల‌పు.. మ‌రింత ఆల‌స్యం

ravitejaర‌వితేజకి బ్యాడ్ టైమ్ న‌డుస్తూనే ఉంది. ఆయ‌న చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అదే.. ‘బ‌లుపు’. ఈ సినిమా కూడా ముక్కుతూ, మూలుగుతూ న‌డుస్తోంది. బ‌య్యర్లు ఈ సినిమాపై ఆస‌క్తిని చూపించ‌క పోవ‌డం ప్రధాన కార‌ణం. షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. నిజానికి ఈ సినిమాని మేలో విడుద‌ల చేయాల‌నుకొన్నారు. అయితే చిత్రబృందం త‌న నిర్ణయాన్ని మార్చుకొని జూన్‌ కి వాయిదా వేశారు. ఓ పాట‌, ఇంకొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించాల్సివుంది. ఆడియో కూడా విడుద‌ల చేయాలి. ఇవ‌న్నీ అయ్యాక‌… సినిమాకి కాస్తో కూస్తో క్రేజ్ వ‌చ్చాక‌… జ‌నం మీద‌కు వ‌ద‌లాల‌ని చూస్తున్నారు. మ‌రి బ‌లుపుకి రావ‌ల్సిన క్రేజ్ వ‌స్తుందో లేదో??