బలుపు ఫస్ట్ లుక్ @ రవితేజ బర్త్ డే

Ravi-Tejas-balupuరవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బలుపు’ చిత్రం ఫస్ట్ లుక్ జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని పీవీపీ మూవీస్ బ్యానర్ మీద ప్రసాద్ వి పోట్లూరి నిర్మిస్తున్నారు. శృతి హసన్ మరియు అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో రవితేజ మరియు శృతి హసన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరించారు. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. సరైన హిట్ లేక డీలా పడిన రవితేజ ఈ చిత్రం పైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.