సింహా తరవాత నందమూరి బాలకృష్ణ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ద తగ్గించారు. అందుకే… శ్రీమన్నారాయణలో కాస్త లావుగా కనిపించారు. ఆ తరవాత మరో సినిమా చేయలేదు. దాంతో పాటు రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకే… ఫిట్నెస్ గురించి ఆలోచించే అవకాశం రాలేదు. అందుకే… ఆయన మరింత ఒళ్లు చేశారు. ఇప్పుడు రూలర్ కోసం స్లిమ్ అవుతున్నారు. ఈ సినిమాలో మీరు స్లిమ్ గా కనిపించాలి… అని బోయపాటి శ్రీను బాలయ్యను కోరాడట. ఆయన కూడా దర్శకుడి మాటకు విలువిచ్చారు. బాలకృష్ణ గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అందుకే జిమ్‌లో కసరత్తులు చేయలేదు. ఇప్పుడు వెన్ను నొప్పి కాస్త శాంతించింది. అందుకే… మళ్లీ జిమ్‌కి వెళ్లి తన బాడీకి తగిన ఎక్సరసైజులు చేయబోతున్నారు. త్వరలోనే సరికొత్త బాలయ్యను చూడొచ్చన్నమాట. అభిమానులూ… గెట్ రెడీ!