కరోనా నియంత్రణ చర్యల కోసం బాలకృష్ణ మొత్తంగా రూ. 1.25 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 50 లక్షల చొప్పున అందజేయనున్నట్టు చెప్పారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీ కళ్యాణ్‌కు అందించారు.
కాగ బాలకృష్ణ విరాళంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రతి కష్టసమయంలోను,ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే,మీరెప్పుడు తోడుంటారు’ అని ట్వీట్ చేశారు చిరు.