అగ‌ష్టు రెండోవారం లో ‘భ‌లే భ‌లే మగాడివోయ్’

BBMఅల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో మిర్చి, ర‌న్‌ రాజా ర‌న్, జిల్ లాంటి హ్య‌ట్రిక్ సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ ని సొంతం చేసుకున్న‌ క్రేజి ప్రోడ‌క్ష‌న్ హౌస్ యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా రూపోందిస్తున్న ఫ్యామిలి అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ “భ‌లే భ‌లే మ‌గాడివోయ్”.

నాని, లావ‌ణ్య త్రిపాఠి లు జంట‌గా న‌టిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తొ యూత్ లో ఐకాన్ డైర‌క్ట‌ర్ గా బ్రాండ్ వేసుకున్న మోస్ట్ క్రేజియ‌స్ట్ డైర‌క్ట‌ర్ మారుతి ద‌ర్శ‌కుడు. హ్య‌ట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న యంగ్ టాలెంటెడ్ నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌. రెండు పాట‌ల షూటింగ్ మిన‌హ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మ‌లు పూర్త‌య్యాయి. ఈరెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ జులై రెండ‌వ వారంలో చేస్తారు. అగ‌ష్టు రెండ‌వ వారంలో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌,
ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత:బ‌న్నివాసు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి