నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో చారిత్రాత్మక హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య బాబు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యాడు. దర్శకుడు ఇప్పటికే బాలయ్య కథకు సంబంధించిన స్క్రిప్టును రెడీ చేసే పనిలో పడ్డాడు. తాజాగా దర్శకుడు ఈ చిత్రం కోసం ‘రెడ్డిగారు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే టైటిల్‌ను బాలయ్య ముందు ఉంచడానికి రెడీ అవుతున్నాడట.
బాలయ్యబాబు కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. హిందుపురం ఎమ్మెల్యేగా భాద్యతలు నిర్వర్తిస్తున్న బాలయ్య ఇలా కులం ప్రస్తావన ఉన్న ‘రెడ్డిగారు’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తే కచ్చితంగా అది వివాదాస్పదం అవుతుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఏపీలో కు విభేదాలు చాలా ఉన్నాయి. పైగా ఇప్పుడు బాలయ్య ‘రెడ్డిగారు’ అనే టైటిల్ ఒక కులానికి సంబంధించిన పేరును టైటిల్‌గా ఉంచితే అది అంతా రచ్చ రచ్చ అవుతంది. కాబట్టి బాలయ్య ఈ టైటిల్‌కు నో చెబితే అన్ని విధాల బాగుంటుంది అని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఈ కాలంలో ఇలాంటి టైటిల్లకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవడం అసాధ్యమే.