Site icon TeluguMirchi.com

బాలయ్య కొత్త సినిమా ఖరారైంది !

balayya
లెజెండ్ సక్సెస్ తో మాంచి జోరు మీద వున్నారు బాలయ్య. లెజెండ్ రిలీజై వారం గడవకుండానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఖారారు చేశారుబాలయ్య. యంగ్ డైరెక్టర్ సత్యదేవ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రుద్రపాటి రమణారావు ‘ఎస్ఎల్‌వి సినిమా’ బేనర్లో బాలయ్య నటించబోతున్నారు. ప్రొడక్షన్ నెం. 3గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాను భారీ తారాగణం, భారీ బడ్జెట్, హైటెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కించబోతున్నారట. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.

Exit mobile version