బాలయ్య నుండి పిలుపు వచ్చింది ..

రెండు భారీ షాక్ లనుండి నందమూరి బాలకృష్ణ పూర్తిగా బయటపడ్డాడు. ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం తో పాటు ఎన్నికల ఫలితాలు ఈ రెండు బాలయ్య కు గట్టి షాకే ఇచ్చాయి. ఈ షాక్ లనుండి బయటపడిన బాలయ్య మళ్లీ వరుస సినిమాలతో బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్లో ఓ మూవీ కి కొబ్బరి కాయ కొట్టగా వచ్చే నెల నుండి ఈ మూవీ షూటింగ్ విదేశాల్లో మొదలు కాబోతుంది. అక్కడే లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు.

ఈ సినిమా తో పాటు బోయపాటి శ్రీను కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వినయ విధేయ రామ భారీ షాక్ తో వెనుకపడ్డ బోయపాటి..బాలయ్య తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాడు. కానీ బాలయ్య ఇతర పనులతో బిజీ గా ఉండడం శ్రీను ను హోల్డ్ పెట్టారు. తాజాగా ఇప్పుడు శ్రీను కు ఫుల్ క్లారిటీ ఇచ్చాడట. తాను కేఎస్ రవికుమార్ తరువాత బాగా సన్నబడి, మేకోవర్ తో మీ సినిమా చేస్తానని, అన్నీ రెడీ చేసుకోమని బోయపాటికి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బాలయ్య శ్రీను కు ఓకే చెప్పడం పట్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.