బాబాయ్ – అబ్బాయ్‌ల షూటింగులు ఒకేచోట జరుగుతున్నాయ్. ఓపక్క బాబాయ్ బాలకృష్ణ సీనియస్‌గా ఫైటింగులు చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ సమంతతో స్టెప్పులు వేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో బాబాయ్ – అబ్బాయ్‌ల సందడి అలా ఉంది. రూలర్, రామయ్యా వస్తావయ్యా షూటింగ్‌లు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. రూలర్ కోసం అక్కడ యాక్షన్ ఘట్టాలు తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్ లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నాడు. సోమవారం ఓ పాటని చిత్రీకరించారు. ఈ రోజు పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఎన్టీఆర్… పెళ్లికొడుకుగా ముస్తాబవుతున్నాడు. రామయ్య సెప్టెంబరులో వస్తే… రూలర్ సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు.