Site icon TeluguMirchi.com

బాల‌య్య ఫ్యాన్స్‌… గ్రేట్‌!

balakrishan boyapaati movieఅభిమానం అంటే – త‌మ హీరో సినిమా విడుద‌ల రోజు బ్యాన‌ర్లు క‌ట్టడం, ఆ సినిమా ఫ్లాప్ అయినా ఒక‌టికి నాలుగుసార్లు చూడ‌డం కాదు. త‌మ అభిమాన క‌థానాయ‌కుడి పిలుపు అందుకొని సామాజిక కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోవాలి. చిటికేస్తే సైన్యంలా క‌దిలి రావాలి. ఈ విష‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ బాధితుల‌కు త‌మ వంతుగా రూ. 1,66,768 అందించ‌నున్నారు. నంద‌మూరి బాల‌య్య అభిమానులంతా ఒక్క తాటిపై నిల‌బడి ఈ భారీ మొత్తం క‌లెక్ట్ చేశార‌ట‌. ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వన్ త‌ర‌పునుంచి ఆ మొత్తాన్ని ప్రధాన‌మంత్రి స‌హాయ నిథికి అంద‌చేస్తారు. మిగ‌తా హీరోల అభిమానులు కూడా… బాల‌య్య ఫ్యాన్స్ దారిలో న‌డిస్తే… అదే ఫ్యాన్సిజానికి నిజ‌మైన అర్థం.

Exit mobile version