లెజెండ్ లో బిపాసా బసు వచ్చి చేరింది. దాంతో ఈసినిమాకి మరింత గ్లామర్ వచ్చింది. బాలయ్య తో ఓ మస్త్ ఐటెమ్ పాట చేయించడానికి చిత్రబృందం చాలామంది కథానాయికల్ని పరిశీలించింది. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమీరారెడ్డి కూడా ఖరారైందనే వార్తలొచ్చాయి. అయితే ఆ అవకాశం బిపాసాను వరించింది. కథానాయిగా అంత బిజీగా లేకపోయినా, ఐటెమ్ గాళ్ గా మాత్రం బిపాసాకు ఇంకా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకొని… ఏకంగా కోటిపాతిక లక్షలు డిమాండ్ చేసిందని సమాచారమ్. కనీసం ఐదు రోజుల్లో ఈ పాటను పూర్తి చేస్తారు కాబట్టి.. రోజుకి ఆమె పారితోషికం పాతిక లక్షలన్నమాట. లెజెండ్ పుణ్యాన బిపాసాకు గొప్ప రేటే గిట్టింది. ‘గబ్బర్ సింగ్’ కోసం బాలీవుడ్ నుంచి మలైకా అరోరాకు కోటి రూపాయలిచ్చి దిగుమతి చేసుకొన్నారు. ఆ రికార్డ్‌ను లెజెండ్ ఇలా బ్రేక్ చేసిందన్నమాట.